

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదికపై జరుగుతున్న ప్రచారానికి వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఈ నెల 9న షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖను పార్టీ విడుదల చేసింది. బెంగళూరులోని తన నివాసంలో అంజలి పెళ్లి నిర్వహించాలనే ప్రతిపాదనపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అంజలి పెళ్లి విషయం తెలిసి సంతోషించానని చెబుతూనే, తన నివాసంలో వేడుక నిర్వహిస్తే భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తన కుటుంబ భద్రతను విస్మరించలేనని, తన కుమార్తెల వివాహాల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకునేవాడినని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కొందరి ద్వారా షర్మిలకు తెలియజేసినప్పటికీ, తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని మరో వేదికను ఎంచుకోవాలని కోరారు. అవసరమైతే హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో అంజలి వివాహాన్ని నిర్వహించుకోవచ్చని ప్రత్యామ్నాయాన్ని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!