24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరులో ఐబీఎం భారీ డీల్‌..

Writer: Chandrika 09:25 PM, 24 అక్టోబర్, 2026
బెంగళూరులో ఐబీఎం భారీ డీల్‌..

అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఐబీఎం భారత్‌లో కార్యాలయ విస్తరణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని బాగ్మానే సోలేరియం సిటీలో ఉన్న రాడాన్‌ టవర్‌లో 2.83 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్లకు లీజుకు తీసుకుంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ పత్రాల ఆధారంగా ప్రాప్‌స్టాక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తులు ఈ ఒప్పందంలో ఉన్నాయి. చదరపు అడుగుకు నెలకు రూ.88 చొప్పున ఐబీఎం ప్రారంభ అద్దెగా సుమారు రూ.2.49 కోట్లు చెల్లించనుంది. ప్రతి మూడేళ్లకు అద్దెను 15 శాతం పెంచేలా ఒప్పందం కుదిరింది. భవన యజమాని ఆకృతి ఇన్‌ఫ్రా-బిల్డ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.14.96 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా చెల్లించింది.

సాధారణ అద్దెకు అదనంగా కార్యాలయ అంతర్గత ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కోసం ఐబీఎం నెలకు సుమారు రూ.2.98 కోట్ల ఫిట్‌-అవుట్‌ అద్దె చెల్లించనుంది. ఈ చెల్లింపులు మార్చి 2031 వరకు కొనసాగనుండగా, వాటి మొత్తం వ్యయం దాదాపు రూ.179 కోట్లుగా అంచనా వేశారు. దీంతో అద్దె, ఫిట్‌-అవుట్‌ ఖర్చులు కలిపి సుమారు రూ.522 కోట్లకు చేరనున్నాయి. లీజు 2026 ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. ఒప్పందంపై మే 29న సంతకాలు జరగగా, అక్టోబర్‌ 1న రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గురుగ్రామ్‌లోనూ 2.30 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐబీఎం లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి దివ్యశ్రీ ఓరియన్‌ క్యాంపస్‌లోనూ సంస్థకు కార్యాలయ కార్యకలాపాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి బొండాడ గ్రూప్..

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి బొండాడ గ్రూప్..

డార్క్‌వెబ్‌లో ఖాతాదారుల వివరాల లీక్.. నగదు భద్రతపై ఎస్‌బీఐ కీలక ప్రకటన

డార్క్‌వెబ్‌లో ఖాతాదారుల వివరాల లీక్.. నగదు భద్రతపై ఎస్‌బీఐ కీలక ప్రకటన

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు భారీ స్పందన, దరఖాస్తుల్లో రికార్డు

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు భారీ స్పందన, దరఖాస్తుల్లో రికార్డు

ట్యాగ్లు
ఐబీఎం ఇండియాఐబీఎం బెంగళూరుబెంగళూరు కార్యాలయ లీజుబాగ్మానే సోలేరియం సిటీరాడాన్‌ టవర్‌వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌కార్యాలయ విస్తరణఫిట్‌-అవుట్‌ అద్దెటెక్నాలజీ రంగంభారత వ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
సినిమాలు

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్
సినిమాలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.
జనరల్

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

జర్మనీలో హిట్లర్‌ విడిది భవనం ‘ఈగిల్స్‌ నెస్ట్‌’లో అగ్నిప్రమాదం
జనరల్

జర్మనీలో హిట్లర్‌ విడిది భవనం ‘ఈగిల్స్‌ నెస్ట్‌’లో అగ్నిప్రమాదం

సీఎం విజయ్‌కు ఎయిర్‌ఇండియా కృతజ్ఞతలు
జనరల్

సీఎం విజయ్‌కు ఎయిర్‌ఇండియా కృతజ్ఞతలు

బెంగళూరులో ఐబీఎం భారీ డీల్‌..
బిజినెస్

బెంగళూరులో ఐబీఎం భారీ డీల్‌..

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అభిషేక్‌ శర్మ చరిత్ర
క్రీడలు

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అభిషేక్‌ శర్మ చరిత్ర

జుహు కాల్పుల ఘటన తర్వాత వార్తల్లోకి టైగర్‌ ష్రాఫ్‌ ఆస్తి లావాదేవీ
జనరల్

జుహు కాల్పుల ఘటన తర్వాత వార్తల్లోకి టైగర్‌ ష్రాఫ్‌ ఆస్తి లావాదేవీ

టీజీ-ఐపాస్‌ సర్వర్‌పై సైబర్‌ దాడి!
జనరల్

టీజీ-ఐపాస్‌ సర్వర్‌పై సైబర్‌ దాడి!

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌.. ఆర్‌సీ 17పై అప్‌డేట్‌
సినిమాలు

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌.. ఆర్‌సీ 17పై అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!