

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ తాజా షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. మంగళవారం రాత్రి ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఆకుపచ్చ క్యాప్, డార్క్ ఓవర్‌కోట్, మెరూన్ టీషర్ట్, నల్లటి ప్యాంటుతో మహేశ్ బాబు స్టైలిష్‌గా కనిపించారు. ‘వారణాసి’లోని తన పాత్ర కోసం గత కొంతకాలంగా పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన ఆయన, సినిమా షూటింగ్‌లో ప్రధాన భాగం పూర్తవడంతో మళ్లీ తన ట్రేడ్‌మార్క్ క్లీన్‌షేవ్ లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలో మహేశ్ బాబు కనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతోంది. సుమారు రూ.1,400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌తో పాటు కెన్యా, జార్జియా వంటి విదేశీ ప్రాంతాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ, తాను ఊహించిన దానికంటే మెరుగ్గా నటించి ‘రుద్ర’ పాత్రకు న్యాయం చేశారని పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి, మహేశ్ బాబు కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!