

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన అనంతరం రజినీకాంత్ స్టైల్, స్టార్ పవర్, బాడీ లాంగ్వేజ్, స్వాగ్‌ను కొనియాడారు. “చొక్కా నలగకుండా రూ.500 కోట్లు కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా, ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని అల్లు అర్జున్ ప్రశంసించారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన శైలిలో మరో విజయవంతమైన చిత్రాన్ని అందించారని బన్నీ అభినందించారు. అద్భుతమైన నేపథ్య సంగీతంతో అనిరుధ్ రవిచందర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారని పేర్కొన్నారు. చిత్రంలో నటించిన తారాగణం, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాతలు సమష్టిగా కృషి చేసి సినిమాకు విజయాన్ని అందించారని ప్రశంసించారు. రజినీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అల్లు అర్జున్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!