

యంగ్ హీరో, నిర్మాత రాకేష్ వర్రే నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’ విడుదలకు సిద్ధమవుతోంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుమిత సర్కార్ కథానాయికగా నటిస్తున్నారు. గతంలో ఇదే బ్యానర్‌పై ‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించి ప్రశంసలు అందుకున్న రాకేష్ వర్రే.. ఇప్పుడు ‘మాయలేడి’తో మరో ఆసక్తికరమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
‘మాయలేడి’ చిత్రాన్ని నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీ లవర్స్‌లో ఆసక్తిని పెంచుకున్న ఈ చిత్రం థియేటర్లలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కథ, నటీనటుల ప్రదర్శన, ప్రచార చిత్రాలపై ఏర్పడిన ఆసక్తి నేపథ్యంలో ‘మాయలేడి’ విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!