

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరుగుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చిన దక్షి ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజా ఓటింగ్ ట్రెండ్స్ పేరుతో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వారం రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణకు ఎక్కువ మద్దతు లభిస్తోందని, ఝాన్సీ, టెంపర్ వంశీ, వర్షిణి, సుధీర్ కూడా పోటీలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ అధికారికంగా ధ్రువీకరించని ఓటింగ్ అంచనాలే.
ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వచ్చిన దక్షి, కేవలం రెండు వారాలకే ఎలిమినేట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. మరోవైపు, శ్వేతా నాయుడు, నీతూ మాస్టర్, దక్షి, శివలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, టాస్క్‌లో విజయం సాధించి నీతూ మాస్టర్ సేఫ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తుండటంతో ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, లేక డబుల్ ఎలిమినేషన్‌తో ప్రేక్షకులకు షాక్ ఇస్తారా అనే ఆసక్తి నెలకొంది. దక్షి ఎలిమినేషన్‌పై వస్తున్న ఊహాగానాలు నిజమవుతాయా, చివరి నిమిషంలో ఓటింగ్ ఫలితాలు మారుతాయా అన్నది అధికారిక ఎపిసోడ్‌లోనే తేలనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!