

‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’ విజయవంతమైన తర్వాత రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ మరోసారి కలిసి పనిచేయనున్నారు. తాత్కాలికంగా ‘ఆర్‌సీ 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. నవంబర్ 1న సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం పలువురి పేర్లను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, హీరోయిన్ ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. నటీనటులు, సాంకేతిక బృందం, చిత్రీకరణ షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!