
ఆరోగ్యం

నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కుటుంబం శుక్రవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. తమ కుమార్తె అవంతిక వివాహానికి ఆహ్వానిస్తూ ఖుష్బూ, ఆమె భర్త సుందర్ సి ప్రధానికి శుభలేఖ అందజేశారు. ఈ భేటీలో అవంతికతో పాటు ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అవంతిక మలయాళంలో ‘ఆరంభం’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇవ్వనుండగా, పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!