

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘కింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, షారుక్ కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. నవంబర్ 2న షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘కింగ్’ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ చిత్రంలో షారుక్ ఖాన్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం. కరీనా కపూర్‌తో కలిసి ‘డాడీ కూల్’ అనే ప్రత్యేక గీతంలో ఆయన నృత్యం చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ పాటతో పాటు సుహానా ఖాన్‌తో కలిసి నటించే యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!