
సినిమాలు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కీలక సమావేశం జరిగింది. ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన ‘పర్సంటేజీ విధానం’పై విస్తృతంగా చర్చించారు. ఈ సమస్యను వేగంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు పరిశ్రమ పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ అంశంపై స్పష్టత తీసుకురావడానికి ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ను కమిటీ చైర్మన్‌గా నియమించగా, అల్లు అరవింద్, దిల్ రాజు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. కే.ఎల్ నారాయణ, కే. అశోక్ కుమార్ కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సమాన ప్రాధాన్యం కల్పించేలా కమిటీని రూపొందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!