
జనరల్

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి.
వైద్యుల పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. భుజానికి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!