

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “పళ్లిచట్టంబి” నుంచి హీరోయిన్ కయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. డ్రాగన్ మూవీ సక్సెస్ తర్వాత కయదు లోహర్‌కు పెరిగిన క్రేజ్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌కు కూడా మంచి స్పందన లభించింది.
“పళ్లిచట్టంబి” ఏప్రిల్ 9 న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 50, 60 దశకాల నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మూవీలో టొవినో థామస్ ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో కనిపించనున్నారు. బలమైన కథ, టెక్నికల్ విలువలతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను ఏర్పరచుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!