

సినిమా పరిశ్రమలో పేరు, గ్లామర్ ఉన్నా, వాటి తో పాటు తప్పుడు వార్తలు, అవమానకర పరిస్థితులు కూడా వస్తుంటాయి. యువ నటి కయాదు లోహర్ ఇటీవల అలాంటి పరిస్థితినే ఎదురుకుంది. పార్టీలకు హాజరవడానికి రూ.35 లక్షలు తీసుకుంటుందన్న రూమర్లు వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు స్పందించని ఆమె, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న బాధను బయటపెట్టింది.
బిహైండ్‌వుడ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను ఈ రూమర్ల గురించి అడిగినప్పుడు కయాదు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. “నాకు సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇలాంటి విషయాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. నిద్రపోయే సమయంలో కూడా ఈ రూమర్ల గురించే ఆలోచన వస్తోంది. వాళ్లు పెట్టే తప్పుడు వార్తలు ఒక నటుడు/నటీమణి మనసును ఎంత దెబ్బతీస్తాయో వారికి అర్థం కాదు. నేను ఎప్పుడూ అందరితో మంచిగానే ఉంటాను. అయినా ఇలాంటి చెడ్డ రూమర్లు నాపై వచ్చాయి” అని ఆమె చెప్పింది.
ఈ పరిస్థితిని పూర్తిగా ఎదుర్కొనలేకపోయినా, ఇది వృత్తిలో భాగమేనని అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నానంటోంది కయాదు. ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగానే కళ్లలో నీరు ఉబికింది. అయినప్పటికీ ఆమె పనులు ఆపకుండా కొనసాగిస్తున్నది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫంకీ చిత్రంతో రాబోతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!