
సినిమాలు

సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ సినిమా విడుదలకు ముందే తమిళ సినీ వర్గాల్లో మంచి చర్చకు దారితీస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాల సమ్మేళనంగా రాబోతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సూర్య, త్రిష జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ప్రచార దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం చిత్రబృందానికి పెద్ద ఊరటనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ‘కరుప్పు’కు కలిసొచ్చే అంశంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!