

వియత్నాంలో జరిగిన విషాద ఘటనలో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు బాధితుల భౌతికకాయాలను భారత్‌కు తరలించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వియత్నాం ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రక్రియలను వేగవంతం చేస్తున్నాయని, సోమవారం హైదరాబాద్‌కు భౌతికకాయాలు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
వియత్నాంలో చిక్కుకుపోయిన మిగిలిన తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. భౌతికకాయాల అప్పగింత ప్రక్రియను సులభతరం చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు ఈ-కేర్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!