
జనరల్

కల్కి 2898 ఏడీ సినిమా భారీ విజయంతో దాని సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా పార్ట్ 2లో జేడీ చక్రవర్తి నటిస్తున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను జేడీ చక్రవర్తి ఖండించారు.
తన కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ, తాను ‘కల్కి 2’లో భాగం కాదని, ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఈ రూమర్స్ వినడానికి బాగానే ఉన్నాయని కానీ అవి నిజం కాదని తెలిపారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ పార్ట్‌లో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు మరింత విస్తరించనున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!