

ప్రజలు తీసుకునే ఆహారం, దాని నాణ్యతపై అవగాహన పెంచే లక్ష్యంతో నటి కాజల్ అగర్వాల్ ప్రారంభించిన కొత్త సోషల్ మీడియా ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ ‘వాట్స్ ఆన్ యువర్ ప్లేట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా సినీ ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తూ, సమంత రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్‌లను ప్రత్యేకంగా నామినేట్ చేశారు.
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే తమ ఆహారపు ప్లేట్ల ఫొటోలను షేర్ చేస్తూ వ్యవసాయంలో ఉపయోగించే పురుగుమందులు, రసాయనాల ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అధిక రసాయనాల వినియోగం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావాలను ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని తెలిపారు. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం జూలై 24న విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!