

టీపీసీసీ చీఫ్ సమర్పించిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న 'సర్' కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైన పార్టీ ఇన్చార్జీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని నివేదికలో పేర్కొనడంతో, సంబంధిత ఇన్‌చార్జీలపై సీఎం సీరియస్ అయినట్లు తెలిసింది.
నివేదిక ప్రకారం 52 నియోజకవర్గాల్లో 'సార్' కార్యక్రమం అమలు సంతృప్తికరంగా ఉండగా, 42 నియోజకవర్గాల్లో పనితీరు సాధారణ స్థాయిలో ఉందని అంచనా వేశారు. మరో 21 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలతో అనుసంధానాన్ని బలోపేతం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!