
ఓటీటీ

ఎన్‌బీకే111 నుంచి అభిమానులను ఆకట్టుకునే అప్‌డేట్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
పోస్టర్‌లో కాజల్ సాధారణ చీరకట్టులో, కళ్లజోడుతో సీరియస్ లుక్‌లో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ-కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇదే. ఈ సినిమాలో ఆమె కథను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!