

భారత్‌లో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం నమోదైన 25 నగరాల జాబితాలోనూ భారతీయ నగరాలే చోటు దక్కించుకున్నాయి. నవంబర్ 4న వెలువడిన రియల్‌టైమ్ కాలుష్య గణాంకాల ప్రకారం, రాజస్థాన్‌లోని బికనీర్ 732 ఏక్యూఐతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. హర్యానాలోని సోనిపట్ 668, రోహ్‌తక్ 654 ఏక్యూఐతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ 25 నగరాలూ ప్రమాదకర కాలుష్య స్థాయిలో ఉన్నట్లు నమోదైంది. దీంతో కాలుష్య సమస్య ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది.
ఘజియాబాద్‌లో 560, గ్రేటర్ నోయిడాలో 553, హిసార్‌లో 552, మొరాదాబాద్‌లో 551, న్యూఢిల్లీలో 546 ఏక్యూఐ నమోదైంది. నోయిడాలో 519 ఏక్యూఐ రికార్డైంది. భివానీ, బులంద్‌షహర్, భటిండా, మీరట్, అలీగఢ్ వంటి నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చోటు సంపాదించాయి. అమెరికా ఏక్యూఐ ప్రమాణాల ప్రకారం 300కు పైగా నమోదైతేనే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. అయితే, పలు భారతీయ నగరాల్లో ఈ స్థాయి 500 దాటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇవి రియల్‌టైమ్ గణాంకాలు కావడంతో రోజంతా మారే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!