
జనరల్

మద్యం రవాణా టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై దర్యాప్తులో భాగంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను మనీలాండరింగ్ కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
మద్యం రవాణా టెండర్ల వ్యవహారంలో అక్రమంగా నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో మరికొందరు నేతలు, అధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించానని, తనకు తెలిసిన వివరాలన్నీ వెల్లడించానని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో వాసుదేవరెడ్డిని సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!