

కోలీవుడ్ హీరో కార్తీ ప్రస్తుతం పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’తో బిజీగా ఉన్నారు. స్పై యాక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో కార్తీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఖైదీ 2’పై కూడా ఆసక్తి కొనసాగుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ సీక్వెల్ చాలా కాలంగా చర్చలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. తాజాగా ‘సర్దార్ 2’ కార్యక్రమంలో కార్తీ ఈ సినిమాపై స్పందిస్తూ.. ‘ఖైదీ 2’ తప్పకుండా ఉంటుందని, ముందుగా ‘సర్దార్ 2’ను చూడాలని అభిమానులకు సూచించారు.
అయితే ‘ఖైదీ 2’ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై కార్తీ తాజా వ్యాఖ్యల్లో స్పష్టత తక్కువగా కనిపించడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. గతంతో పోలిస్తే ఈసారి ఆయన ప్రారంభ తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రాజెక్ట్ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన లేకపోవడంతో కార్తీ, లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!