

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇప్పటికే ఈ సినిమాపై వెంకటేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు దీనికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారనే సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. కథలోని కీలక పాత్రలను పరిచయం చేయడంతో పాటు వెంకటేష్ పాత్రకు సంబంధించిన గత సంఘటనలను ప్రేక్షకులకు వివరించే బాధ్యతను ఎన్టీఆర్ వాయిస్ ద్వారా అందించనున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ స్వరం వినిపిస్తే కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కథలోని ప్రధాన సంఘర్షణను ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా ఈ వాయిస్ ఓవర్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. గతంలో ‘లెనిన్’ చిత్రానికి కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన స్వరం వినిపించనుందనే వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తోంది. నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!