
జనరల్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి నెలకొనగా, చిరంజీవి పవర్‌ఫుల్ డైలాగులు, డ్యాన్సులు, ముఖ్యంగా ‘వీణ’ స్టెప్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అప్పట్లో పలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి చిరంజీవి స్టార్‌డమ్‌ను మరింత పెంచింది.
తాజాగా ‘ఇంద్ర’ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ మెగా అభిమానులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా ఈ బ్లాక్‌బస్టర్‌ను ఆస్వాదించేలా 4కే రీమాస్టర్డ్ వెర్షన్‌ను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. సరికొత్త హంగులతో రూపొందించిన ‘ఇంద్ర’ 4కే వెర్షన్‌ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!