

వెబ్ సిరీస్‌గా భారీ ఆదరణ పొందిన ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీ ఇప్పుడు సినిమాగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ‘మీర్జాపూర్ ది మూవీ’ 2026లో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. తొలి వీకెండ్‌లో హిందీలో రూ.96.85 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించగా, తెలుగులో పరిమిత థియేటర్లలో రూ.84 లక్షలు రాబట్టింది. హిందీ వసూళ్లు శుక్రవారం రూ.27.85 కోట్లు, శనివారం రూ.32.50 కోట్లు, ఆదివారం రూ.36.50 కోట్లుగా నమోదయ్యాయి.
వెబ్ సిరీస్ నుంచి వెండితెరపైకి వచ్చిన ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీ ప్రయోగం విజయవంతమైందని ఈ వసూళ్లు సూచిస్తున్నాయి. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి తొలి వీకెండ్‌లోనే భారీ స్పందన లభించింది. దీంతో ఇప్పుడు సోమవారం వసూళ్లపై అందరి దృష్టి నెలకొంది. తొలి వీకెండ్ జోరును కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!