

నాచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ అనుకున్న సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక పని ఇంకా పూర్తికావాల్సి ఉందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు నేపథ్య సంగీతాన్ని ఇంకా పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. త్వరలోనే ఈ పనిని ప్రారంభించి మరికొద్ది రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. నాని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!