
క్రీడలు

జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె తమిళ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల 'పెద్ది' చిత్రంలో అచ్చియమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ, ఇప్పుడు దర్శకుడు పా. రంజిత్ రూపొందించనున్న వెబ్ సిరీస్లో కథానాయికగా నటించేందుకు అంగీకరించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వెబ్ సిరీస్కు దర్శకుడు సర్కునం దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్య కథలను తనదైన శైలిలో తెరకెక్కించే సర్కునం దర్శకత్వంలో జాన్వీ ఎలా కనిపించనుందనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!