

'సమ్మర్ హాలిడేస్' చిత్రం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రంలోని 'క్రష్' పాటను ఆనంద్ దేవరకొండ, ఆదిత్య హాసన్, నిర్మాత ఎస్. కే. ఎన్. విడుదల చేశారు. ఈ గీతానికి సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం రచించారు.
ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, సినిమాలోని చిన్నారుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. టీజర్ తనను భావోద్వేగానికి గురి చేసిందని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ, ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించినట్లే సినిమాను కూడా పలుమార్లు చూడాలనిపించేలా రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో చిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!