
జనరల్

ప్రత్యేక గీతాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో మెరిసింది. ఈ ఏడాది ‘ది మిరాకిల్స్ గాలా’ కార్యక్రమానికి భారతీయ సెలబ్రిటీగా హాజరైన ఆమె, ప్రపంచ ప్రసిద్ధ తారల సరసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సొగసైన నల్లటి మినీ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ క్లాసిక్ హాలీవుడ్ గ్లామర్‌ను అలవోకగా ప్రదర్శించింది.
ఈ సందర్భంగా జాక్వెలిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో “కేన్స్‌లో మిరాకిల్ షో కోసం” అనే క్యాప్షన్‌తో ఫొటోలను పంచుకుంది. ఆమె అందం, స్టైల్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, జాక్వెలిన్ త్వరలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వెల్కమ్ టు ది జంగిల్’ చిత్రంలో కనిపించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!