

టాలీవుడ్‌లో భారీ స్థాయిలో ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాల్లో ‘ఇట్లు అర్జున’ ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి ప్రముఖ హీరోలు ఈ సినిమాకు మద్దతు తెలపడంతో చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. అనీష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల.. వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
తాజాగా ‘ఇట్లు అర్జున’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేపు జరగనున్న పెయిడ్ ప్రీమియర్స్‌తో పాటు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షోలకు టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు చిత్ర బృందం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రముఖ సినీ తారల మద్దతు, ప్రచార కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఇట్లు అర్జున’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!