

ఎన్టీఆర్ సరికొత్త లుక్ అభిమానులు, సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘అరవింద సమేత’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన సినిమా అనౌన్స్‌మెంట్, థీమ్ పోస్టర్ ఈ ఆసక్తిని మరింత పెంచాయి.
భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమాకు సరికొత్త పౌరాణిక ప్రపంచాన్ని పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. భక్తి, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!