
గాసిప్స్

ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ధురంధర్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించారు. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆయన మాట్లాడుతూ, 4 గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలని అన్నారు. సినిమా చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశారని, మొదటి భాగం కంటే ఇది మరింత మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక అంశాలు, సంగీతం, డిజైన్, దర్శకత్వం అన్నింటిలోనూ అద్భుతంగా పని చేశారని రాజమౌళి తెలిపారు. ఎక్కడా లోపాలు కనిపించలేదని, కథనం నిజమైన ఉత్కంఠను సృష్టించేలా ఉందని కొనియాడారు. ఆదిత్య ధర్ అద్భుతమైన పని చేశారని, ఈ సినిమా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుందని అభిప్రాయపడ్డారు.


.jpg&w=3840&q=75)













.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!