

ఎప్పటికప్పుడు యంగ్ ఎనర్జీతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తన మాస్ ఇమేజ్ను కొనసాగించిన రవితేజ ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారనే వార్త టాలీవుడ్లో ఆసక్తి రేపుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించనున్నట్లు సమాచారం. స్టైలిష్ లుక్స్‌కు దూరంగా, ఎంతో సహజంగా ఉండే గెటప్‌లో ఆయన పాత్రను డిజైన్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా నలుపు దుస్తుల్లో కనిపించనున్నారట. అంతేకాదు, ఓ ప్రీ-టీన్ కుమార్తెకు తండ్రిగా కూడా ఆయన పాత్ర సాగుతుందని టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాలో కీలకమైన ఎపిసోడ్లో రవితేజ వృద్ధుడి గెటప్‌లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ఇది రవితేజ కెరీర్లో ఒక పెద్ద ఇమేజ్ మేకోవర్‌గా నిలిచే అవకాశముంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!