

నేచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. సినిమా పనులు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రకటించిన విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని చిత్రబృందం చెబుతుండటంతో బయ్యర్లలో నమ్మకం పెరిగినట్లు సమాచారం. నాని సినిమాలకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘ది ప్యారడైజ్’ థియేట్రికల్ హక్కుల వ్యాపారం రూ.100 కోట్లకు పైగా జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాని తన సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా మార్కెట్‌ను పెంచుకున్న నేపథ్యంలో ఈ బిజినెస్ లెక్కలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే నాని అగ్ర హీరోల స్థాయికి చేరుతున్నాడనే చర్చ మొదలైంది. తాజా బిజినెస్ వార్తలు ఆ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తర్వాత వాస్తవ ఫలితం, దాని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!