

అయోధ్యలో భక్తులు సమర్పించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విరాళాలను దుర్వినియోగం చేసి భక్తులకు, రాముడికి అన్యాయం చేసినవారు ఈసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అన్నారు. ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ అని చెప్పుకొనే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి వారణాసి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఓటమి రుచి చూపించారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ బీజేపీ రాజకీయ బలంపై విమర్శలు గుప్పించారు.
రానున్న రోజుల్లో మోదీకి మరిన్ని ఎన్నికల పరాజయాలు ఎదురుకానున్నాయని అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో ఇద్దరు కీలక నేతల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలకబోతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయోధ్య విరాళాల అంశం, ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ పనితీరుపై బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!