
రాజకీయాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకతను అంతం చేద్దాం’ అనే నినాదంతో భారీ మహా పాదయాత్రకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా విపక్షాల ఇండియా కూటమి నిర్వహిస్తున్న ప్రచారానికి రాజకీయంగా కౌంటర్ ఇచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమాచారం.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. పర్యటనలో భాగంగా సినీ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!