

హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, ఆహార సంస్థలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించడంతో నగరంలోని 15 సంస్థల్లో ఎనిమిది ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కల్తీ అనుమానంతో 16 ఆహార నమూనాలను సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎనిమిది సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేసి, వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
తనిఖీల్లో పలు చోట్ల బొద్దింకలు, ఎలుకల బెడద, పాడైన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు, సరిగా లేని ఆహార నిల్వ విధానాలను అధికారులు గుర్తించారు. లైసెన్సులు సస్పెండ్ చేసిన సంస్థల్లో గచ్చిబౌలిలోని అరోమా మల్టీకుజైన్ రెస్టారెంట్, సఫిల్‌గూడలోని ఆదిత్య రెస్టారెంట్ అండ్ బార్, బేగంబజార్‌లోని వైష్ణవి దర్శిని, కొత్తపేటలోని స్పైసీ హబ్, రాయదుర్గంలోని పక్వాన్ గ్రాండ్, హఫీజ్‌పేట్‌లోని గోదావరి ఘుమఘుమాలు, గోపనపల్లిలోని శ్రీకృష్ణ ఫ్యామిలీ ధాబా ప్యూర్ వెజ్, కొండాపూర్‌లోని శ్రీ సాయి మెస్ బ్రాంచ్ ఉన్నాయి. ప్రగతినగర్‌లోని లక్కీ రెస్టారెంట్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో దానిని కూడా మూసివేయాలని ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!