

దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో, ఆ తేదీ నుంచే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఉప ఎన్నిక తేదీ, షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!