

హైదరాబాద్‌లో నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటించకుండా నోటీసులను పట్టించుకోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు వాటిని పట్టించుకోకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసి, నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.
పదేపదే ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని కొన్ని సంస్థల ఆహార లైసెన్సులను రద్దు చేసే దిశగా కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ఉల్లంఘన కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ అధికారులు హెచ్చరించారు. నోటీసులు అందుకున్నప్పటికీ కొన్ని రెస్టారెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్న అంశంపై వరుస కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!