
జనరల్

అందాల తార శ్రీలీల ఒక వైపు నటనతో, మరోవైపు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు ఆమె మరోసారి తన ఎనర్జీతో తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఓం సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి మరో కథానాయికగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
ఇటీవల ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ కోసం చెన్నైలో భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. మారి 2లోని రౌడీ బేబీ పాట తరహాలో ఉత్సాహభరితమైన స్టెప్పులతో ఈ పాటను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గీతంలో ధనుష్‌తో కలిసి శ్రీలీల వేసే డ్యాన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఎర్రచందనం నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!