

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శక-నిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక క్రేజీ క్రాసోవర్ వీడియోతో ముందుకు వచ్చారు. ఈ వీడియోలో హృతిక్ తన ప్రసిద్ధ పాట ‘ఏక్ పల్ కా జీనా’ లోని ఐకానిక్ డాన్స్ స్టెప్‌ను ఈ సినిమాలో కనిపించే ఏలియన్ పాత్ర ‘రాకీ’ కి నేర్పుతున్నట్లు చూపించారు.
ఈ వీడియోలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, హృతిక్ మరియు రాకీ మధ్య ఉన్న స్నేహాన్ని చూసి ‘కోయీ.. మిల్ గయా’ సినిమాలో హృతిక్‌కు స్నేహితుడైన ఏలియన్ ‘జాదూ’ క్యూట్‌గా స్పందించడం. ఈ సన్నివేశం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది ‘ది మార్షియన్’ రచయిత ఆండీ వీర్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందింది. ఈ నవలపై తనకు ఉన్న ఇష్టాన్ని హృతిక్ ఇప్పటికే గత ఏడాది డిసెంబర్‌లో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఫిల్ లార్డ్ మరియు క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్‌లో భారతదేశంలో ఈ నెల 26 న విడుదల కానుంది. హృతిక్ రోషన్ లాంటి స్టార్ ఈ సినిమాను ప్రమోట్ చేయడం తమకు ఆనందంగా ఉందని సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.



.jpeg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!