

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్ర బృందం అనంత పద్మనాభ స్వామి రథయాత్రను ప్రమోషనల్ కార్యక్రమంగా ప్రారంభించింది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే నెల 3 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా మంచి స్పందన తెచ్చుకుంది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ ఇది కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదని, మన సంస్కృతి, మూలాలను నెక్స్ట్ జనరేషన్‌కు పరిచయం చేసే ప్రయత్నమని తెలిపారు. హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ రెండేళ్ల శ్రమతో చేసిన ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పారు. నభా నటేష్, నిర్మాతలు కూడా ప్రేక్షకుల ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతూ సినిమాను థియేటర్లలో చూడాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!