

అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా విజయంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ కథానాయికగా నటించగా, సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక ఐటం సాంగ్‌ను కూడా చేర్చాలని చిత్రబృందం ముందుగా భావించిందని తమన్ తాజాగా వెల్లడించారు. అఖిల్ కోసం ప్రత్యేకంగా రాయలసీమ యాసలో ఒక పాటను స్వరపరిచినట్లు ఆయన తెలిపారు.
ఆ పాటలో రష్మిక మందన్న, పూజా హెగ్డే, కయాదు లోహర్ లేదా ప్రీతి ముకుందన్లలో ఒకరిని ఎంపిక చేయాలని భావించినట్లు తమన్ చెప్పారు. అయితే ఆ పాట కథా ప్రవాహానికి అంతరాయం కలిగించే అవకాశం ఉందని, ప్రతికూల స్పందన వచ్చే ప్రమాదం ఉందని భావించి చివరి నిమిషంలో దానిని తొలగించినట్లు వెల్లడించారు. ఆ నిర్ణయంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, బాధతో కొన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా బయటకు వచ్చానని తమన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!