
జనరల్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ అనధికారిక సమావేశం నవంబర్ 5న హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖలోని కేబినెట్ విభాగం నవంబర్ 4న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సమావేశంలో ప్రధానంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు ఆహ్వానాలు పంపించారు. రానున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ప్రణాళికలు, నిర్వహణ అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!