

టాలీవుడ్ యువసామ్రాట్ నాగ చైతన్య నేడు (నవంబర్ 23) తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1986 నవంబర్ 23న జన్మించిన ఆయన 2009లో జోష్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చైతన్య.. ఏ మాయ చేశావే, 100% లవ్, మనం, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇటీవల తండేల్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నాగ చైతన్య, విభిన్న పాత్రలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన కెరీర్ మరింత విజయవంతంగా సాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టీమ్ టీటైమ్ తెలుగు తరఫున యువసామ్రాట్ నాగ చైతన్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరెన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్‌డే యువసామ్రాట్!




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!