

టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, వినోదాత్మక కథాంశాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేడు (నవంబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1982 నవంబర్ 23న జన్మించిన ఆయన ఈ ఏడాది 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 2015లో పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి.. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో విజయవంతమైన దర్శకుడిగా ఎదిగారు.
సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా టీమ్ టీటైమ్ తెలుగు తరఫున దర్శకుడు అనిల్ రావిపూడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలను అందించాలని, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్‌డే అనిల్ రావిపూడి!




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!