23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Writer: Shivani K 08:25 AM, 23 నవంబర్, 2026
శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక సోమవారం మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయం ముందు ఉన్న గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది.

కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు, సోమవారాల్లో స్పర్శ దర్శనంతో పాటు సామూహిక, గర్భాలయ అభిషేకాలను నెలంతా నిలిపివేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు నాలుగు విడతల్లో స్పర్శ దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం రద్దీ అధికంగా ఉండటంతో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. రెండో కార్తీక సోమవారం సందర్భంగా సాయంత్రం ప్రధానాలయం ఈశాన్య భాగంలోని ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. ఆదివారం స్వామి, అమ్మవార్లను 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

ట్యాగ్లు
శ్రీశైలంకార్తీకమాసంకార్తీక సోమవారంమల్లికార్జున స్వామిభ్రమరాంబ అమ్మవారుభక్తుల రద్దీఅలంకార దర్శనంలక్షదీపోత్సవంపుష్కరిణి హారతినంద్యాల జిల్లా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్
బిజినెస్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
జనరల్

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి
క్రీడలు

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి
బిజినెస్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం
జనరల్

కార్తీక మూడో సోమవారం.. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తి ఆలయం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?
జనరల్

ఆదిభట్ల టీసీఎస్‌లో అయ్యప్ప మాల వివాదం.. ఉద్యోగికి అనుమతి నిరాకరణ?

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
జనరల్

తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!