

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూన్‌లోపు దేశీయ మార్కెట్‌లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేయనున్నట్లు విన్‌ఫాస్ట్ ఇండియా మార్కెట్ సీఈఓ అనురాగ్ సక్సేనా వెల్లడించారు. కొత్త స్కూటర్లతో పాటు బ్యాటరీ స్వాపింగ్ సదుపాయం, 2029 వరకు ఉచిత ఛార్జింగ్, దీర్ఘకాలిక బ్యాటరీ వారంటీ వంటి ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో వీఎఫ్ 6, వీఎఫ్ 7 సహా నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న విన్‌ఫాస్ట్, వచ్చే ఏడాది ప్రారంభంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ వీఎఫ్ 5 సహా కనీసం మరో రెండు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కంపెనీ ఆసియా సీఈఓ తపన్ ఘోష్ వెల్లడించారు. ఇప్పటివరకు భారత్‌లో 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన విన్‌గ్రూప్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణతో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!