

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న తొలి చిత్రం శనివారం సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా చిత్ర ప్రారంభోత్సవానికి చిత్ర యూనిట్‌తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. ఈ చిత్రానికి శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా, తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, టాలెంటెడ్ దర్శకుడు రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నిర్మాత దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రంలో యువ నటులు జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రేమ, భావోద్వేగాలు, వినోదం కలగలిపిన కథతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించేలా సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు రఘువర్ధన్ కోట్ల వెల్లడించారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!