

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌తో దేశవ్యాప్తంగా భారీ హైప్ సృష్టించింది. ఈ వేడుకలో మూడవ సింగిల్ ‘హల్లల్ల ల్లో’ను ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శనతో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘పెద్ది’ ప్రతి హృదయాన్ని తాకే సినిమా అని, తన ఫిల్మ్ లైబ్రరీలో ఇది నంబర్ వన్‌గా నిలుస్తుందని భావోద్వేగంగా తెలిపారు. సినిమా కోసం మొత్తం టీమ్ అంకితభావంతో పనిచేసిందని, వచ్చే నెల 4 న థియేటర్లలో తప్పకుండా చూడాలని కోరారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌తో పాటలు మరో స్థాయికి వెళ్లాయని తెలిపారు. జాన్వీ కపూర్, రవి కిషన్ సహా పలువురు నటీనటులు సినిమా శక్తివంతమైన భావోద్వేగాలను ప్రశంసించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా విజన్ సినిమాను ప్రత్యేకంగా నిలిపిందని టీమ్ పేర్కొంది. భోపాల్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రేక్షకుల భారీ హాజరు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!